నాన్ మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు,
అర్జున్ సమాచారం,ఆగస్టు 20: జిల్లా ప్రతినిధి (కొమరం భీం)
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా నాన్ మ్యాపింగ్ ఓటర్లకు వెంటనే నోటీసులు జారీ చేసి, నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ రాజస్వ మండల అధికారులతో పాటు తహసీల్దార్లు, సూపర్‌వైజర్లతో నాన్ మ్యాపింగ్ ఓటర్లు, అనమలీస్ జాబితాలోని ఓటర్ల వ్యత్యాసాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 20,929 మంది నాన్ మ్యాపింగ్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరందరికీ ముందుగానే నోటీసులు అందించి, ఎన్నికల సంఘం సూచించిన ఆధారాలను స్వీకరించాలని సూచించారు. అక్టోబర్ 5వ తేదీలోగా నాన్ మ్యాపింగ్ ఓటర్ల హియరింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే ఓటర్ల జాబితాలో పేరు, తండ్రి పేరు, వయస్సు తదితర వివరాల్లో ఉన్న చిన్నచిన్న వ్యత్యాసాలను బూత్ స్థాయి అధికారి, తహసీల్దార్ లాగిన్‌ల ద్వారా పరిశీలించి సరిచేయాలని సూచించారు. తద్వారా అనమలీస్ జాబితాలోని ఓటర్ల సంఖ్యను తగ్గించవచ్చన్నారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.